bjp leaders stormed the SP office: మహబుబ్నగర్లో కొనసాగుతున్న అక్రమ అరెస్టులకు నిరసనగా భాజపా కార్యకర్తలు ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్లను ఒక్కొక్కరుగా అరెస్ట్ చేస్తున్నారని ఆందోళన చేపట్టారు. మరో 25 మంది పైన కేసులు పెడతామని పోలీసులు చెబుతున్నారని భాజపా జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి ఆరోపించారు.
ఇలా చేస్తూ పోతే ప్రశ్నించే గొంతుకలే పాలమూరులో వినిపించవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దిల్లీలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అతిధిగృహం నుంచి వ్యక్తులను అపహరించడాన్ని తీవ్రంగా ఖండించారు . మంత్రి తక్షణం కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని వీరబ్రహ్మచారి డిమాండ్ చేశారు.