మహబూబ్నగర్ జిల్లాలో కురుమూర్తి స్వామి జాతర మహోత్సవాలు యథావిధిగా నిర్వహించాలని భాజపా ఆధ్వర్యంలో దేవరకద్రలో ఆందోళన చేపట్టారు. 167వ జాతీయ రహదారిపై బైఠాయించాయించి ధర్నా చేశారు. జాతర నిర్వహణపై కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను వెంటనే విరమించుకుని ఉత్సవాల నిర్వహణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కురుమూర్తి జాతర నిర్వహించాలని భాజపా ఆందోళన - దేవరకద్ర వార్తలు
కురుమూర్తి జాతర మహోత్సవాలు యథావిధిగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భాజపా ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో ఆందోళన నిర్వహించారు. 167వ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

కురుమూర్తి జాతర నిర్వహించాలని భాజపా ఆందోళన
ఉత్సవాలు నిర్వహించే వరకు హిందూ సంఘాల ఆధ్వర్యంలో... నిరంతరం ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు. రాస్తా రోకో కారణంగా జాతీయ రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు.