తెరాసను ఎదుర్కొనేందుకు సంకల్పం ఉన్న పార్టీ కేవలం భాజాపానేనని జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో తెలిపారు. కాంగ్రెస్ తెరాస జేబు పార్టీయని ప్రస్తుతం తిరిగి ఎదగలేనటువంటి స్థితికి పతనమైందని ఎద్దేవా చేశారు. 2022 వరకు ఇళ్లు, కరెంట్, రక్షిత మంచి నీరు లేని కుటుంబం ఉండొద్దన్నదే మోదీ ఆకాంక్ష అన్నారు. అందుకు అనుగుణంగా ఈ అయిదేళ్లలో 100 లక్షల కోట్లతో రహదారులు, 50 లక్షల కోట్లు రైల్వే లైన్లకు ఖర్చు చేస్తున్నామని వివరించారు.
తెరాస జేబు పార్టీ కాంగ్రెస్: మురళీధర రావు - Bjp leader Fires on TRS and Congress
తెరాసను ఎదుర్కొనేందుకు సంకల్పం ఉన్న పార్టీ కేవలం భాజాపానేనని జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు వెల్లడించారు. తెలంగాణలో తెరాస వ్యతిరేక ఓటర్లకు పార్టీ బలోపేతమవుతుందనే విశ్వాసం ఉందని మహబూబ్నగర్లో జరిగిన సమావేశంలో ఆశాభావం వ్యక్తం చేశారు.
తెరాస జేబు పార్టీ కాంగ్రెస్: మురళీధర రావు
TAGGED:
Muralidharrao press meet