తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు: డీకే అరుణ - పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్​ పీవీ కూతురుకు సీటు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటో అందరికీ తెలుసని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఎన్నికల కోసమే ఉద్యోగాల భర్తీ, పీఆర్సీ గురించి సీఎం కేసీఆర్​ ప్రస్తావించారని ఆమె ఆరోపించారు.

తెరాస నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు: డీకే అరుణ
తెరాస నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు: డీకే అరుణ

By

Published : Feb 27, 2021, 8:48 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే 50 వేల పోస్టుల భర్తీ, పీఆర్సీ రాగాన్ని ముఖ్యమంత్రి అందుకున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. 30వేల ఉద్యోగాలిచ్చి లక్షా 30వేల ఉద్యోగాలిచ్చినట్లు తెరాస నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని భాజపా కార్యాలయంలో ఆమె మాట్లాడారు. తెరాసకు ఓట్లు వేయబోరని భావించి పీవీ కుమార్తె వాణీదేవిని రంగంలోకి దింపారన్నారు.

పీవీ సమాధిని కూల్చుతామని కొందరు వ్యాఖ్యలు చేసినప్పుడు నోరు విప్పని కేసీఆర్... ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పీవీ కూతురుకు సీటు ఇవ్వడం వెనక ఆంతర్యం ఏమిటో అందరికీ తెలుసన్నారు. పీవీపై అభిమానం ఉంటే నామినేషన్ పద్ధతిలో ఆమెకు పదవి కేటాయించి ఉండాల్సిందన్నారు. పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలపై మండలిలో గళం వినిపించాలంటే రాంచందర్ రావునే మండలికి పంపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మండలిలో ప్రజల తరపున గళం విప్పాలంటే రాంచందర్ రావు తప్ప మిగిలిన అభ్యర్థులెవరి వల్లా కాదని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు.

తెరాస నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు: డీకే అరుణ

ఇదీ చదవండి: మంత్రుల సవాల్​: ఒక్క ఉద్యోగం ఎక్కువిచ్చినా రాజీనామా చేస్తాం

ABOUT THE AUTHOR

...view details