ప్రజల్ని ఎప్పుడు ఎలా బోల్తా కొట్టించాలో కేసీఆర్కు తెలిసినంతగా ఎవరికీ తెలియదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఉద్యోగాల భర్తీ ప్రకటన చేశారని ఆరోపించారు. మహబూబ్నగర్ భాజపా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
'ప్రజల్ని ఎలా బోల్తా కొట్టించాలో సీఎంకు బాగా తెలుసు' - ముఖ్యమంత్రిపై డీకే అరుణ వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి కేసీఆర్... ఉద్యోగాల భర్తీ ప్రకటన చేశారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. మహబూబ్నగర్ భాజపా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
'ప్రజల్ని ఎలా బోల్తా కొట్టించాలో సీఎంకు బాగా తెలుసు'
కేసీఆర్ గారడీలకు ప్రజలు మోసపోవద్దని అరుణ విజ్ఞప్తి చేశారు. గతంలో ఇస్తానన్న రెండు డీఏలు ఇప్పటి వరకు ఇవ్వలేదని గుర్తు చేశారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐఆర్, పీఆర్ సహా నిరుద్యోగ భృతి, పండిట్, పీఆర్టీల అప్ గ్రేడేషన్ ఇప్పటి వరకూ అమలు కాలేదన్నారు. కొత్త మున్సిపాలిటీ, పాఠశాలల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.