ద్విచక్రవాహనం అదుపు తప్పి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ సమీపంలో చోటుచేసుకొంది. వ్యక్తిగత పనులు కోసం జడ్చర్లకు వెళ్లిన గంగాపూర్ గ్రామానికి చెందిన గోవర్ధన్.. తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. 167వ జాతీయ రహదారి పక్కన ఎల్లమ్మ ఆలయం సమీపంలో బైక్ అదుపుతప్పింది. అక్కడకక్కడే మృతిచెందాడు. కేవలం 5 నిమిషాల్లో ఇళ్లు చేరుకుంటాడనగా ఈ ఘటన జరిగింది.
ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాడనగా.. - mahabubnagar crime news
కేవలం ఐదు నిమిషాలు ప్రయాణిస్తే ఇంటికి చేరేంత దూరం.. ఆ లోపలే ద్విచక్రవాహనం రూపంలో మృత్యువు అనంత లోకాలకు తీసుకుపోయింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాడనగా..
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.