రాష్ట్రంలోని అన్ని కులాలకు తెరాస ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్ కాలనీ వద్ద జాండ్ర కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. కమ్యూనిటీ భవనం పెద్దలకు, పిల్లలకు అందరికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. విద్యార్థులకు వసతితో పాటు కోచింగ్ కేంద్రంగా ఉండేలా నిర్మించాలని తెలిపారు.
'తెరాస ప్రభుత్వం అన్ని కులాలకు అండగా నిలుస్తోంది' - Bhoomi Puja for Jandra Community Building
రాష్ట్రంలోని అన్ని కులాలకు తెరాస ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జాండ్ర కమ్యూనిటీ భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. వృద్ధులకు ఉపయోగపడేలా గదులను నిర్మించాలని సూచించారు.
'తెరాస ప్రభుత్వం అన్ని కులాలకు అండగా నిలుస్తోంది
అంతకుముందు అరుంధతీ భవన్‌ను మంత్రి ప్రారంభించారు. 'పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ' అన్న అంబేడ్కర్ మహాశయుడి నినాదానికి ఇప్పటికి పరిపూర్ణత చేకూరలేదని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాజ్యాధికారం వైపుగా దళిత బహుజనుల అడుగులు శరవేగంగా పడాలని ఆయన ఆకాంక్షించారు. దళితుల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ... గురుకులాలు విస్తృతంగా ఏర్పాటు చేస్తుందన్నారు.