మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలం పెద్దమునిగల్చేడ్ గ్రామంలో కొన్ని రోజులుగా అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతున్నది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు.
అక్రమ ఇసుక తరలింపుపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు - మహబూబ్ నగర్ జిల్లా వార్తలు
మహబూబ్‌నగర్ జిల్ల్ అడ్డాకల్ మండలంలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన జిల్లా ఎస్పీప రెమా రాజేశ్వరికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
అక్రమ ఇసుక తరలింపుపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు
స్థానిక ప్రజా ప్రతినిధి ఈ ఇసుక రవాణాలో నేరుగా సంబంధం కలిగి ఉన్నాడని, అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అక్రమ దందాపై విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసు, రెవిన్యూ, మైనింగ్ శాఖలు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ బాధ్యతను మరిచి అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇవీ చూడండి: ఎమ్మెల్యే రాజాసింగ్ గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్