Rythu Bandhu: రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న వేళ...అధికార పార్టీ సంబరాలు చేస్తుంటే... ఆ సంతోషం కొంతమంది రైతులకు మాత్రం చేరడం లేదు. రైతుబంధు డబ్బుల్ని తీసుకోకుండా బ్యాంకులు వారి ఖాతాల్ని స్తంభింప చేయడమే ఇందుకు కారణం. జోగులాంబ గద్వాల జిల్లా కేటి దొడ్డి మండలం గువ్వలదిన్నె గ్రామానికి చెందిన సుమారు 60మంది రైతుల ఖాతాలు ఈ తరహాలోనే నిలిచిపోయాయి. వారి ఖాతాల్లోకి చేరిన రైతుబంధు డబ్బులు తీసుకోకుండా బ్యాంకు అధికారులు లావాదేవీలు నిలిపివేశారని రైతులు ఆరోపిస్తున్నారు. బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Rythu Bandhu: ఖాతాల్లో రైతుబంధు పైసలు.. తీసుకోకుండా చేస్తున్న బ్యాంకులు.. - ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా
Rythu Bandhu: రైతుబంధు సాయాన్ని ఇతర రుణాలకు లంకె పెట్టి ఇవ్వకుండా ఆపొద్దని ప్రభుత్వం సూచించినా క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు పట్టించుకోవడం లేదు. ఈ కారణంగా రైతుబంధు డబ్బుల కోసం అన్నదాతలు బ్యాంకుల ముందు పడిగాపులు కాయాల్సివస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం గువ్వలదిన్నె రైతులకు అదే పరిస్థితి ఎదురైంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని చాల బ్యాంకుల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
రైతుబంధు డబ్బుల్ని ఏ రుణాల్లోనూ జమ చేసుకోవద్దని కలెక్టర్ స్థాయి అధికారులు బ్యాంకర్లకు సూచించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదు. దీంతో పెట్టుబడి సాయం అందిన సంబరం అక్కడే ఆవిరైపోతోంది. జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం మాన్ దొడ్డి, ఉప్పేరు, గుడెందొడ్డి గ్రామాలకు చెందిన సుమారు 140 మంది రైతులు మూడేళ్లుగా బ్యాంకులో జమైన రైతుబంధు డబ్బుల్ని ఒక్కసారి కూడా తీసుకోలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే... రుణఖాతా, రైతుబంధు ఖాతా ఒకటే అవడం లేదా.. ఒకే బ్యాంకులో ఉన్నచోట ఈ సమస్య వస్తోందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. రుణాల పునరుద్ధరణకు సహకరిస్తే సమస్య పరిష్కారం అవుతుందని సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: