మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రిని.. చికాగో ఇల్లినాయిస్ యూనివర్సిటీలో క్లినికల్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్, సర్జీగా పనిచేస్తున్న విజయ్ యెల్దండి సందర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రి, వైద్య కళాశాలను ఇన్ఫెక్షన్ల నివారణ-నియంత్రణ, సిబ్బంది, రోగుల ఆరోగ్య భద్రత అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.
'తెలంగాణలోనే ఆదర్శ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతా'
మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రి, వైద్య కళాశాలను ఇన్ఫెక్షన్ల నివారణ-నియంత్రణ, సిబ్బంది, రోగుల ఆరోగ్య భద్రత అంశాలపై తెలంగాణలోనే ఆదర్శ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రభుత్వ వైద్యకళాలలో డాక్టర్ విజయ్ యెల్దండి అధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు సలహాలు అందించాలని విజయ్ ఎల్దండి కోరారు. జిల్లా కేంద్రంలో వైద్య సేవలను విస్తృతం చేసేందుకు నూతన కలెక్టరేట్ భవన నిర్మాణం పూర్తైన తర్వాత పాత కార్యాలయాన్ని చిన్న పిల్లల ఆస్పత్రిగా మారుస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా వాసులకు సేవలందించేందుకు ముందుకు వచ్చిన విజయ్ యెల్దండికి... కలెక్టర్ వెంకట్రావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
కరోనా వైరస్‌కు ప్రజలు భయపడొద్దని... స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన చేతులు, స్వచ్ఛమైన వాతావరణమనే మూడు నియమాలను పాటించాలని కోరారు.