తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏటీఎమ్‌లో చోరీ.. 15 లక్షలు దోపిడీ - జడ్చర్లలోని ఎస్‌బీఐ ఏటీఎమ్‌లో చోరీ

atm-theft-in-mahaboobnagar-district
atm-theft-in-mahaboobnagar-district

By

Published : Sep 29, 2020, 3:23 PM IST

Updated : Sep 29, 2020, 5:24 PM IST

15:15 September 29

ఏటీఎమ్‌లో చోరీ.. 15 లక్షలు దోపిడీ

ఏటీఎం కేంద్రంలో మిషన్ గ్యాస్ కట్టర్​తో కత్తిరించి రూ.15 లక్షల నగదును గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకుంది. జడ్చర్లలోని సిగ్నల్ గడ్డ ఎస్బీఐ బ్యాంకు పక్కన ఉన్న ఏటీఎంలో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి గ్యాస్ కట్టర్​తో మిషన్​ను కట్ చేసి 15 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఈ విషయంపై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మహబూబ్​నగర్​ డీఎస్పీ శ్రీధర్ జడ్చర్ల వీరస్వామి బ్యాంకు ఏటీఎంను సందర్శించి విచారించారు. 

    రాత్రి ఈ సంఘటన చోటు చేసుకోగా ఉదయం బ్యాంకు అధికారులు వచ్చి బ్యాంకు తలుపులు తీసి చూడగా... దొంగలు నగదును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.  రూ.15లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు బ్యాంకు మేనేజర్ దీపిక తెలిపారు. 

ఇవీ చూడండి: వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన ఏఎస్సైతో పాటు మరో ఇద్దరు అరెస్ట్!


 

Last Updated : Sep 29, 2020, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details