తెలంగాణ

telangana

ETV Bharat / state

కల్వకుర్తి ఎత్తిపోతల్లో మరో రెండు పంపులకు ఏర్పాట్లు - రేపు బీహెచ్​ఈఎల్​ బృందం సందర్శన

కల్వకుర్తి ఎత్తిపోతల్లో మరో రెండు పంపులను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రెండు, మూడు రోజుల్లో మరో పంపు పునరుద్ధరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో పంపును ఈ నెల 24 వరకు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.

arrangements-for-other-pumps-in-kalwakurthy-lift-irrigation
కల్వకుర్తి ఎత్తిపోత్తల్లో మరో రెండు పంపులకు ఏర్పాట్లు

By

Published : Dec 10, 2020, 5:26 AM IST

కల్వకుర్తి ఎత్తిపోతలకు సంబంధించి.. మరో రెండు పంపులను పునరుద్ధరించేందుకు నీటి పారుదలశాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండు పంపుల పునరుద్ధరణ పూర్తై నీటిని ఎత్తిపోస్తుండగా.. ఇంకా మూడు పంపులు సిద్ధం కావాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లో ఒక పంపును పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో పంపును... ఈ నెల 24 వరకు ప్రారంభించాలని భావిస్తున్నారు.

నీటమునగడంతో తీవ్రంగా దెబ్బతిన్న ఐదో పంపు పంపుహౌజ్‌ను... రేపు బీహెచ్​ఈఎల్​ బృందం సందర్శించనుంది. పంపును పరిశీలించి అక్కడే మరమ్మతులు చేసే అవకాశం ఉంటే చేస్తారు. ఇందుకు కనీసం మూణ్నెళ్ల సమయం పడుతుందని అంచనా. ఒకవేళ అక్కడ మరమ్మతులు చేసే అవకాశం లేకపోతే.. భోపాల్‌కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదే జరిగితే ఐదో పంపు సిద్ధమయ్యేందుకు మరికొంత సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి :'ప్రపంచానికి టీకా అందించే సత్తా భారత్​కే ఉంది'

ABOUT THE AUTHOR

...view details