ప్రభుత్వ శాఖల్లో డబ్బు ఇవ్వనిదే పనులు జరగవని అపోహ ప్రజల్లో ఉందని.. దీన్ని పారదోలేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్. అందుకు జిల్లా వ్యాప్తంగా "మా భరోసా" అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ఆయన వివరించారు. భూ సమస్యలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి సిబ్బంది ఎవరైనా లంచం అడిగితే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. ఏ శాఖలోనైనా పనులు నిర్ణీత గడువులో జరగకపోయినా, అధికారులు జాప్యం చేస్తున్నారని భావించినా ఫిర్యాదు చేయాలని చేయాలన్నారు. మా భరోసా కు వచ్చిన ఫిర్యాదులను ప్రత్యేక బృందాలు పరిశీలించి 24 గంటల్లో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, సమస్య తీవ్రతను బట్టి పై అధికారుల దృష్టికి తీసుకుపోతారన్నారు.
మా భరోసా కార్యక్రమంకు రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు మద్దతు తెలిపాయని గ్రామగ్రామాన తిరిగి కాల్ సెంటర్‌పై అవగాహన కల్పిస్తారని, అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామస్తులు అక్కడి ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేస్తారన్నారు.
అవినీతి రహితమే 'మా భరోసా' లక్ష్యం - undefined
అవినీతి రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని.. అందుకు "మా భరోసా" ఉంటుందని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు అవినీతిని నిర్మూలించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.
అవినీతి రహితమే 'మా భరోసా' లక్ష్యం
ఇవీ చూడండి: ఈ నెల 18,19న శాసనసభ ప్రత్యేక సమావేశాలు