మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని ఆంధ్రాబ్యాంకు అధికారులు లాక్డౌన్ సమయంలో పేదలు, వలస కూలీలు, వీధి వ్యాపారులు, పురపాలిక సిబ్బంది మొత్తం ప్రతిరోజూ 700 మందికి అల్పాహారం అందిస్తున్నారు. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగుల ఛారిటబుల్ ఛాలెంజ్ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో అల్పాహార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
700 మందికి అల్పాహారం అందిస్తున్న బ్యాంకు ఉద్యోగులు
లాక్డౌన్ సమయంలో ప్రతీ ఒక్కరు తమకు తోచిన సాయం చేస్తూ.. మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదవారికి నిత్యావసరాలు పంచేవారు కొందరైతే.. వలస కూలీల ఆకలి తీర్చే అన్నదాతలు మరికొందరు. సాయం చేసే చేతులకు బాసటగా నిలుస్తూ చేయందించేవారు కొందరు. మహబూబ్‌నగర్ జిల్లాలో బ్యాంకు అధికారులు ప్రతిరోజూ అల్పాహారం అందిస్తూ.. సేవాగుణాన్ని చాటుకుంటున్నారు.
700 మందికి అల్పాహారం అందిస్తున్న బ్యాంకు ఉద్యోగులు
జిల్లా కేంద్రంలో బ్యాంకు అధికారులు ఏర్పాటు చేసిన అల్పాహార పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు ప్రారంభించారు. సేవ చేయడం కూడా ఛాలెంజ్‌గా తీసుకొని తోటివారిని భాగస్వామ్యం చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. అల్పాహార కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టర్ పేదలకు అల్పాహార పొట్లాలు అందించారు.
ఇదీ చూడండి:రెండోరోజు 'ఉద్దీపన'లపై కోటి ఆశలు!