మున్సిపల్ ఎన్నికల సందర్భంగాకొడంగల్ పురపాలికలోఓ అరుదైన ఓటు పడింది. 1963లో కొడంగల్ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు ఓటేసిన ఓ వ్యక్తి మళ్లీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నాడు. మధ్యలో ఓటు వేయలేదా అంటే..? అసలేం జరిగిందంటే...
60 ఏళ్ల తర్వాత మళ్లీ పురపాలిక ఎన్నికల్లో ఓటేశాడు - An old man who has voted in municipal elections after 60 years
60 ఏళ్ల తర్వాత ఓ వ్యక్తి మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసిన ఘటన కొడంగల్‌లో జరిగింది. కొడంగల్‌కు చెందిన కుర్తి కేశవాచారి 1963లో కొడంగల్ పురపాలికగా ఉన్నప్పుడు ఓటు వేశాడు. తర్వాత మళ్లీ ఇప్పుడు కొడంగల్‌ను మున్సిపాలిటీగా ప్రకటించిన తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నాడు.
60 ఏళ్ల తర్వాత పురపోరులో మళ్లీ ఓటేశాడు
1963 తర్వాత కొడంగల్‌ను అప్పటి సర్కారు గ్రామపంచాయితీగా ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొడంగల్‌ను తిరిగి మున్సిపాలిటీగా ప్రకటించింది. అప్పట్లో మున్సిపాలిటీగా ఉన్నప్పుడు ఓటు వేసిన కుర్తి కేశవాచారి మళ్లీ సుమారు 60 ఏళ్లకు కొడంగల్ మున్సిపాలిటీగా తిరిగి అవతరించాక తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. స్థానికంగా ఉండకపోయినా హైదరాబాద్ నుంచి వచ్చి ఓటేశాడు.
ఇదీ చూడండి: చేతుల్లేకపోయినా.. ఓటేసి స్ఫూర్తినిచ్చాడు