మినీ పురపాలక పోరులో ప్రధాన పార్టీలన్నీ ప్రచార జోరు పెంచాయి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పురపాలికలో ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. భాజపా తరఫున పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ ప్రచారం పాల్గొన్నారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి తమ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. అధికార తెరాస వైఫల్యాలను ఎండగట్టారు.
తెరాస తరఫున ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కాలనీల్లో విస్తృతంగా పర్యటించారు. తాము చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజలు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెరాసకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. కాంగ్రెస్ తరఫున పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, జడ్చర్ల నియోజకవర్గం సమన్వయకర్త అనిరుధ్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. స్వతంత్ర, సీపీఐ, సీపీఎం అభ్యర్థులు కూడా తమదైన శైలిలో ప్రచారం చేపట్టారు.