తెలంగాణ

telangana

ETV Bharat / state

రేషన్‌ పద్ధతిలో మద్యం.. బీర్లు అడిగినన్ని

మద్యం ధరలు పెంచడం వల్ల ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని తెలంగాణా బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ గోదాముల్లో అమ్మకాలు ఆలస్యమయ్యాయి. కొత్త ధరలు రావడం ఆలస్యం కావడం వల్ల మధ్యాహ్నం రెండు గంటల తర్వాత సరకు ఇవ్వడం ప్రారంభించి సాయంత్రం నాలుగు గంటలకే ముగించారు.

mahabubnagar district wines business latest news
mahabubnagar district wines business latest news

By

Published : May 7, 2020, 2:45 PM IST

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రేషన్‌ పద్ధతిన (ఒక్కో దుకాణానికి 150 పెట్టెలు)మద్యం ఇవ్వగా... బీర్లు మాత్రం అడిగినన్ని ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని 96 మద్యం దుకాణాదారులు రూ.7 కోట్లకు పైగా మద్యం కొనుగోలు చేశారు. తిమ్మాజిపేట, కడుకుంట్ల (వనపర్తి) గోదాముల్లో పది నుంచి పద్దెనిమిది రోజులకు సరిపడా నిల్వలున్నట్టు బేవరేజస్‌ అధికారుల సమాచారం. రెండు గోదాముల్లో కలిపి మద్యం 1.35 లక్షల పెట్టెలు, బీర్లు 2.18 లక్షల పెట్టెలు నిల్వ ఉన్నాయి. పెంచిన ధరలకనుగుణంగా ఉమ్మడి జిల్లాలోని మద్యం అమ్మకాల ద్వారా ప్రతిరోజూ రూ.75 లక్షల అదనపు ఆదాయం ప్రభుత్వానికి సమకూరనున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details