మహబుబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లోని న్యూ ఫ్లాట్స్ క్రీస్తు సంఘం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. అబ్రహం హాజరయ్యారు. ప్రభుత్వం తరుఫున క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు.
తెలంగాణలో అన్నిమతాలకు సమ ప్రాధాన్యం: ఎమ్మెల్యే - బతుకమ్మ చీరల పంపిణీ
సీఎం కేసీఆర్ అన్ని మతాలకు సమ ప్రాధాన్యమిస్తున్నారని అలంపూర్ ఎమ్మెల్యే డా. అబ్రహం పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరై, క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ కానుకలు అందజేశారు.

క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసిన అలంపూర్ ఎమ్మెల్యే
ఏ తారతమ్యాలు లేకుండా అన్ని వర్గాలు పండగలను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం.. క్రైస్తవ సోదురులకు క్రిస్మస్ కానుక, ముస్లింలకు రంజాన్ తోఫా, హిందువులకు బతుకమ్మ చీరల పంపిణీ పేరిట కానుకలను అందజేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జడ్పీ ఛైర్మన్ సరిత పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలి'