అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరని ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి మండిపడ్డారు. కృష్ణా నదిపై ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, పోతిరెడ్డిపాడుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కష్ణా జలాల పరిరక్షణ దీక్ష చేపట్టినట్లు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కర్వేన రిజర్వాయిర్ దగ్గర దీక్షలు చేపట్టేందుకు వెళ్తున్న ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డిని అడ్డుకుని భూత్పూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
'అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరు' - 'అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరు'
కృష్ణా జలాల పరిరక్షణ దీక్షకు వెళ్తున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కర్వేన రిజర్వాయిర్ దగ్గర దీక్షలు చేపట్టేందుకు వెళ్తున్న ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డిని అడ్డుకుని భూత్పూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
!['అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరు' aicc Secretary chinnareddy arrested in mahaboobnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7446999-823-7446999-1591101459621.jpg)
అయినా వెనక్కి తగ్గకుండా చిన్నారెడ్డి పోలీస్‌స్టేషన్‌లోనే పరిరక్షణ దీక్ష కొనసాగించారు. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయాలనే తలంపుతో ఆనాడు పెద్ద ఎత్తున ఎత్తిపోతల పథకాలను కాంగ్రెస్ రూపొందించిందని చిన్నారెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ హాయంలో రూ. 38 వేల కోట్లతో రూపొందించిన ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్‌ను పేరుమార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్‌గా రూ.83 వేల కోట్లతో చేపట్టారని ఆరోపించారు. 2015లో ప్రారంభంమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులలో పురోగతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి:నీటిపారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
TAGGED:
కృష్ణ జలాల పరిరక్షణ దీక్ష