ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టులను భర్తీ చేసేందుకు జిల్లా యంత్రాంగం ఈనెల 14న నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో భాగంగా ఈరోజు మహబూబ్నగర్ కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలోని రెవిన్యూ సమావేశ మందిరంలో అధికారులు మౌఖిక పరీక్షలు నిర్వహిస్తున్నారు.
వ్యవసాయ నోటిఫికేషన్.. భారీగా హాజరైన నిరుద్యోగులు - వ్యవసాయ విస్తరణ అధికారుల నోటిఫికేషన్
కరోనా వైరస్, లాక్డౌన్ నేపథ్యంలో నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమైంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో భర్తీ చేస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారులకు భారీ ఎత్తున నిరుద్యోగులు హాజరయ్యారు.
![వ్యవసాయ నోటిఫికేషన్.. భారీగా హాజరైన నిరుద్యోగులు Agricultural Notification Huge Unemployed people Attend at mahabubnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7273629-937-7273629-1589960418049.jpg)
వ్యవసాయ నోటిఫికేషన్.. భారీగా హాజరైన నిరుద్యోగులు
వ్యవసాయ నోటిఫికేషన్.. భారీగా హాజరైన నిరుద్యోగులు
26 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయగా.. వందల సంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలన చర్యలు లేకుండా.. భౌతిక దూరం పాటించకుండా నిరుద్యోగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కలెక్టరేట్లో ఓ వైపు జిల్లా స్థాయి అధికారులకు మౌఖిక పరీక్షలు నిర్వహిస్తుండగా.. కనీస దూరం కూడా పాటించకుండా దరఖాస్తులు అందించేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. పలువురు మాస్కులు కూడా ధరించలేదు.
ఇదీ చూడండి :27 రకాల పురుగుమందులపై వేటు