లాక్‌డౌన్ వల్ల రాష్ట్రంలో పర్యాటక రంగం ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది?
లాక్‌డౌన్ పర్యాటక రంగమే కాకుండా ప్రపంచంలోని అన్ని రంగాలపైన తీవ్ర ప్రభావాన్ని చూపింది. అనేక దేశాలు పర్యాటక రంగంపైన ఆధారపడి జీవిస్తున్నాయి. సింగపూర్, మలేషియా వంటి దేశాలనే ఉదాహరణకు తీసుకోవచ్చు. పర్యాటక రంగంపైనే ఆధారపడిన దేశాల పరిస్థితి అధ్వానంగా ఉంటే మన దేశంలో అనేక రంగాలున్నాయి. కాబట్టి పెద్ద ప్రభావాన్ని చూపిస్తోందని అనుకోవడం లేదు.
కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా పర్యాటక రంగానికి అనుమతులు ఇస్తే ఆ దిశగా మీరు సన్నద్ధంగా ఉన్నారా?
పర్యాటక రంగం అంటేనే విదేశీయులు రావాలి. ప్రపంచ దేశాల్లో కరోనా ప్రభావం ఉంది. విమానాశ్రయాలు బంద్ ఉన్నాయి కాబట్టి వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అభివృద్ధి పరుస్తాం. లాక్‌డౌన్ తర్వాత రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. చరిత్ర కల్గిన ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతాం.
పర్యాటక రంగాన్ని నమ్ముకుని అనేక మంది జీవిస్తున్నారు. లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వాళ్లకు ఎలాంటి సహాయం అందిస్తున్నారు?
ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంతో పాటు పర్యాటక రంగంపైన ఆధారపడిన వాళ్లకు తమ వంతు సాయం చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వం 12 కిలోల బియ్యం, రూ.1500 ఇచ్చాం. కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు. మా మహబూబ్‌నగర్‌లో కూడా అనేక పర్యాటక ప్రాంతాలున్నాయి. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం.
పర్యాటక రంగంపైన ఆధారపడి అనేక రంగాలున్నాయి. ప్రధానంగా అతిథ్య రంగం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహాకారాలు కోరుకుంటున్నారు?