కరోనా విజృంభిస్తోన్న వేళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల నిల్వలు లేవని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని పోలేపల్లి పారిశ్రామికవాడలో ఉన్న ఆక్సిజన్ నిల్వ చేసి సరఫరా చేసే ఎలెన్ బెర్రీ పరిశ్రమలో అదనపు కలెక్టర్ సీతారామరావు, ఆర్డీవో శ్రీనివాసులు స్థానిక అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా పరిశ్రమలో తనిఖీలు - మహబూబ్నగర్ జిల్లా తాజా వార్త
ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉందన్న ఆరోపణలపై మహబూబ్నగర్ జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావు ప్రత్యేక దృష్టి సారించారు. ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించి నిల్వలు, సరఫరాపై ఆరా తీశారు.
ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా పరిశ్రమ ఎలెన్బెర్రీలో తనిఖీలు
అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్న తీరు అక్కడున్న నిల్వలను పరిశీలించారు. సిబ్బందితో వివరాలు ఆరా తీశారు. ప్రస్తుతం సరఫరా అంతా సజావుగానే కొనసాగుతున్నదని ఆక్సిజన్ కొరత లేదని వారు అధికారులకు తెలిపారు. సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని సీతారామరావు కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు.
ఇదీ చూడండి :నేడు ఈసెట్ పరీక్ష... కరోనా కాలంలో తొలి పరీక్ష