షాద్నగర్లో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి - షాద్నగర్లో రోడ్డు ప్రమాదం
షాద్నగర్లో ద్విచక్రవాహనాన్ని జీపు ఢీకొట్టిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 9మందికి గాయాలయ్యాయి.
షాద్నగర్లో రోడ్డు ప్రమాదం
హైదరాబాదు నుంచి షాదనగర్ వైపు వస్తున్న జీపు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న తిరుపతయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. జీపులోని 9 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.