తెలంగాణ

telangana

By

Published : Oct 29, 2019, 1:01 PM IST

Updated : Oct 29, 2019, 1:35 PM IST

ETV Bharat / state

అంబులెన్స్​లో వచ్చింది.. ఉపాధ్యాయురాలిగా తిరిగెళ్లింది!

డెంగీ జ్వరంతో బాధపడుతున్న యువతి అంబులెన్స్‌లో వెళ్లి... కౌన్సెలింగ్‌కు హాజరైన ఘటన మహబూబ్‌నగర్‌లో జరిగింది.

A young woman suffering from dengue fever went in an ambulance and attended a counseling event in Mahabubnagar

మహబూబ్​నగర్​ జిల్లాలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇటీవల వెలువడిన టీఆర్టీ ఫలితాల్లో ఎస్జీటీగా ఎంపికైన యువతి సురేఖ డెంగీ బారిన పడి చికిత్స తీసుకుంటుండగానే.. సెలైన్‌ సీసాతోనే అంబులెన్స్‌లో కౌన్సిలింగ్​కు వచ్చిన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.

వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన సురేఖ ఎస్జీటీగా ఎంపికయ్యారు. వారం రోజులుగా డెంగీతో బాధపడుతున్నారు. ఆదివారానికి ప్లెట్​లెట్​ల సంఖ్య 44 వేలకు పడిపోయింది. సోమవారం ఉదయానికి 19వేలకు తగ్గిపోయింది. అదే రోజు కౌన్సిలింగ్​ ఉన్నందున యువతి తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు. అధికారులను సంప్రదించి మినహాయింపు కోరడానికి ప్రయత్నించారు.

సురేఖ అందుకు అంగీకరించలేదు. కౌన్సిలింగ్​కు హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేయాలని కోరింది. అంబులెన్స్‌లో సెలైన్‌ సీసాతోనే కుమార్తెను మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని కౌన్స్‌లింగ్‌ హాల్‌కు తీసుకువచ్చారు. ఆత్మకూర్‌ మండలం తిప్పడంపల్లి పాఠశాలను ఎంపిక చేసుకున్న సురేఖ తిరిగి చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆసుపత్రికి వెళ్లారు.

అంబులెన్స్​లో వచ్చింది.. ఉపాధ్యాయురాలిగా తిరిగెళ్లింది!

ఇదీ చూడండి: 5 కెమెరాలతో షియోమీ నుంచి సూపర్ బడ్జెట్​ ఫోన్​!

Last Updated : Oct 29, 2019, 1:35 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details