పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ వద్ద చేపట్టిన పనులతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంపు హౌజ్ దెబ్బతినే ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేఎల్ఐ అధికారులు పాలమూరు-రంగారెడ్డి ఇంజనీర్లకు పలుమార్లు లేఖలు రాసినట్లు సమాచారం. రిజర్వాయర్, సొరంగంపనుల్లో భాగంగా చేపట్టే పేలుళ్లతో పంపుహౌజ్ దెబ్బతినే ప్రమాదం ఉందని ఇంజనీర్లు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఒకవేళ పంపుహౌజ్ దెబ్బతింటే తమను బాధ్యులను చేయవద్దని సంబంధిత నిర్మాణ సంస్థ అధికారులకు తెలిపినట్లు తెలుస్తోంది.
కల్వకుర్తి ఎత్తిపోతల పంపుహౌజ్‌కు పొంచిఉన్న ముుప్పు - A threat posed to Kalvakurty pump house
పాలమూరు-రంగారెడ్డి పనులతో కల్వకుర్తి ఎత్తిపోతల పంపుహౌజ్‌లో ప్రకంపనలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఎత్తిపోతల పనుల కోసం పేలుళ్లు జరుపుతున్నారు. దీనివల్ల కేఎల్‌ఐ పంపు హౌజ్ దెబ్బతినే ప్రమాదం ఉందని ఇంజినీర్లు ఆందోళన చెందుతున్నారు.
శ్రీశైలం వెనకభాగం నుంచి నీళ్లు ఎత్తిపోసేలా కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. ఆ పథకం తొలిలిఫ్ట్ సమీపంలోనే కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామం రేమానుగడ్డ వద్ద పాలమూరు రంగారెడ్డి మొదటి లిఫ్ట్ పనులను భూగర్భంలో చేపట్టారు. వాటితోపాటు నార్లాపూర్ జలాశయం, సొరంగ మార్గం పనులు కేఎల్ఐ నిర్మాణాలకు సమీపంలోనే జరుగుతున్నాయి. భారీ పేలుళ్లు చేపట్టడం వల్ల పంపుహౌజ్, రీచ్‌యార్డ్ వంటివి దెబ్బతినే అవకాశం ఉందని పలుమార్లు కేఎల్ఐ ఇంజనీర్లు హెచ్చరించినా.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదీ చూడండి : హుజూర్‌నగర్‌లో ఊపందుకున్న ప్రచార పర్వం...