మహబూబ్‌నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలం చిన్నమునగాల్‌చేడ్ గ్రామానికి చెందిన పశువుల కాపరి మేకల కుర్మయ్య బుధవారం ముఖానికి గిజిగాడి గూడును మాస్కులా ధరించి పింఛన్ కోసం రావడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.
గిజిగాడి గూడు.. మాస్కు అందం చూడు - మాస్క్ తాజా వార్తలు
ఎప్పుడు వచ్చామో కాదన్నయ్యా.. మాస్క్ పెట్టుకున్నామా లేదా అన్నది ముఖ్యం అంటున్నాడు ఓ వృద్ధుడు. పశువులను మేపడానికి వెళ్లిన అతను ఫించన్ ఇస్తున్నారని తెలిసి ఇలా గిజిగాడి గూడును మాస్క్‌గా ధరించి వచ్చాడు. అతడు నిరక్షరాస్యుడైనా బాధ్యతగా వ్యవహరించి ప్రత్యామ్నాయ మాస్కు ధరించి వచ్చినందుకు పలువురు అభినందించారు.
గిజిగాడి గూడుమాస్కు
పశువులను మేపడానికి వెళ్లగా.. పింఛను ఇస్తున్నారని తెలిసి తిరుగుపయనమయ్యారు. దారిలో కనిపించిన పిట్టగూడును తీసుకొని మాస్కుగా ధరించి అక్కడికి వచ్చి పింఛను తీసుకున్నారు. నిరక్షరాస్యుడైనా బాధ్యతగా వ్యవహరించి ప్రత్యామ్నాయ మాస్కు ధరించి వచ్చినందుకు పలువురు అభినందించారు.
ఇదీ చదవండి:అదనపు కట్నం వేధింపులకు ముగ్గురు బలి