మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కిష్టంపల్లి శివారు చెరువులో ఓ వ్యక్తి మృతదేహం లభించింది. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు నాగసాల గ్రామానికి చెందిన రాజుగా గుర్తించి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
మద్యం మత్తులో చేపలవేటకు వెళ్లి మునిగిపోయాడు.. - mahabubnagar district crime news
మద్యం సేవించి చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. మద్యం మత్తులో చేపల వేటకు వెళ్లి మునిగిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
మద్యం మత్తులో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మృతి
మద్యం మత్తులో చేపల వేటకోసం చెరువులో దిగి నీట మునిగి ప్రాణాలు కోల్పోయి ఉంటాడని ఎస్సై శంషాదిన్ అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:'కరోనాపై యుద్ధం కోసం.. వచ్చే ఆదివారం జనతా కర్ఫ్యూ'