తెలంగాణ

telangana

ETV Bharat / state

లేగదూడలపై చిరుత దాడులు.. భయాందోళనలో ప్రజలు - Mahabubnagar District Latest News

మహబూబ్‌నగర్ జిల్లాలో దూడలపై చిరుత పులి వరుసగా దాడి చేయడం పశువుల కాపరులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గద్దెగూడెం, చౌదర్‌పల్లి అటవీ ప్రాంతంలో సంచరిస్తూ సమీప కొట్టాల్లోని లేగదూడలపై దాడి చేస్తోంది. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి చిరుతను అడవిలో వదిలి పెట్టాలని కోరుతున్నారు.

A leopard is attacking cattle calves in Mahabubnagar district
లేగదూడలపై చిరుత పులి వరుస దాడులు

By

Published : Feb 21, 2021, 2:34 PM IST

మహబూబ్‌నగర్ జిల్లాలో లేగదూడలపై వరుసగా చిరుత పులి దాడి చేయడం పశువుల కాపరులను భయాందోళనకు గురిచేస్తోంది. జిల్లాలోని వెంకటయ్య పల్లి , నాగారం, చౌదర్‌పల్లిలో శుక్ర, శని, ఆదివారం రోజుల్లో చిరుత దాడిలో దూడలు మృతి చెందాయి..

రెండు నెలలుగా..

అప్పుడప్పుడు లేగదూడలపై దాడి చేయడం, రైతులకు కనిపిస్తుండటంతో రెండు నెలలుగా ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చౌదర్‌పల్లి, గద్దెగూడెం, మన్యంకొండ అటవీ ప్రాంతంలోని గుట్టల్లో గత కొంత కాలంగా చిరుత పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.

ఈ ఘటనలు పశువుల కాపరులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అధికారులు స్పందించి చిరుతను బంధించి పెద్ద అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి:ఇల్లందుకు ప్రత్యేక గుర్తింపు.. స్వచ్ఛ సర్వేక్షణ్‌ చిత్రాల్లో చోటు

ABOUT THE AUTHOR

...view details