గేదెల ఎదురుదాడిలో తీవ్రంగా గాయపడిన చిరుతపులి చికిత్స పొందుతూ మృతి చెందింది. మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలం బూర్గుపల్లిలో ఈ నెల 10న రైతు నవాద్రెడ్డి తన పశువులను పొలం అంచున ఉన్న గుట్టల్లో మేతకు వదలగా.. గుట్టల్లో దాక్కొని ఉన్న చిరుత ఓ దూడపై దాడికి యత్నించింది.
Leopard died: పశువుల దాడిలో గాయపడిన చిరుత మృతి - telangana varthalu
గేదెల ఎదురుదాడిలో తీవ్రంగా గాయపడిన చిరుత చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ నెల 10న బూర్గుపల్లిలో దూడపై చిరుత దాడికి యత్నించగా... గేదెలు ఎదురుదాడి చేశాయి.
పశువుల దాడిలో గాయపడిన చిరుత మృతి
గేదెలు తిరగబడి కుమ్మడంతో చిరుత నడుము, కాళ్లకు గాయాలై కదలలేని స్థితిలో ఉండిపోయింది. అటవీశాఖ అధికారులు చిరుతను హైదరాబాద్‌లోని జూపార్క్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న చిరుత కోలుకోలేక సోమవారం మృతి చెందినట్లు మహబూబ్‌నగర్ జిల్లా అటవీ శాఖ అధికారి గంగారెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: నడవలేని స్థితిలో చిరుత.. గేదెల దాడే కారణమని అనుమానం..!