తెలంగాణ

telangana

ETV Bharat / state

చిన్నారిని బలి తీసుకున్న నీటి సంపు - baby death

అప్పటి వరకు సంతోషంగా ఆడుతూ.. పాడతూ తిరిగిన చిన్నారి... అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఇంటి ముందున్న నీటిసంపులో పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన మహబూబ్​నగర్​లో చోటుచేసుకుంది.

చిన్నారిని బలి తీసుకున్న నీటి సంపు

By

Published : Jun 14, 2019, 12:46 PM IST

మహబూబ్​నగర్​ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. రెండేళ్ల చిన్నారి నీటి సంపులో పడి మృతి చెందింది. సుజాత, రామస్వామిల కుమార్తె హేతాన్సి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందున్న నీటి సంపులో పడిపోయింది. దాన్ని ఎవరూ గమనించకపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యుల, బంధువుల రోదనలు మిన్నంటాయి.

చిన్నారిని బలి తీసుకున్న నీటి సంపు

ABOUT THE AUTHOR

...view details