నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం నాలుగు వార్డుల్లో అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఐదో వార్డులో తెరాస అభ్యర్ధి వనజ ఏకగ్రీవమయ్యారు. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో పదోవార్డులో తెరాస అభ్యర్ధిగా నామపత్రం దాఖలు చేసిన అనిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మహబూబ్నగర్ జిల్లాలో కారు జోరు - 5 Members UNANIMOUS in Municipal Elections in Mahabubnagar district
మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 5 జిల్లాల్లోని 17 మున్సిపాలిటీల్లో 338 వార్డులకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతునున్నాయి. ఇందులో నాలుగు వార్డులు ఏకగ్రీవం కాగా... 334 వార్డుల్లో 1,412 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు.

మహబూబ్నగర్ జిల్లాలో కారు జోరు
ఉపసంహరణకు ముందే వనపర్తి మున్సిపాలిటీ ఐదో వార్డు తెరాస అభ్యర్థి శాంతమ్మ, అలంపూర్ మున్సిపాలిటీలో ఐదో వార్డు అభ్యర్ధి దేవన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందరూ తెరాస అభ్యర్థులే కావటం గమనార్హం.
మహబూబ్నగర్ జిల్లాలో కారు జోరు
ఇవీచూడండి: పాలమూరులో రసవత్తరంగా పుర ఎన్నికలు