తెలంగాణ

telangana

ETV Bharat / state

150క్వింటాళ్ల అక్రమ రేషన్​ బియ్యం పట్టివేత - మహబూబ్​నగర్​ జిల్లా తాజా వార్తలు

మహబూబ్​నగర్ జిల్లా చిన్న చింతకుంటలో అక్రమంగా నిల్వ ఉంచిన 150 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని రెవెన్యూ, ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు పట్టుకున్నారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, నిందితునిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

150 quintals of illegal ration rice seized in mahabubnagar district
150క్వింటాళ్ల అక్రమ రేషన్​ బియ్యం పట్టివేత

By

Published : Jan 18, 2021, 4:28 AM IST

మహబూబ్​నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అల్లీపూర్​లో అక్రమంగా నిల్వ ఉంచిన 150 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని రెవెన్యూ, ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు పట్టుకున్నారు. వనపర్తి జిల్లా అమరచింత గ్రామానికి చెందిన కృష్ణ... ఈ బియ్యాన్ని తక్కువ ధరకు సేకరించి, అధిక ధరకు అమ్ముకోవడం వ్యాపారంగా మార్చుకున్నాడు.

కొన్ని రోజులుగా సేకరించిన 150క్వింటాళ్ల బియ్యాన్ని అల్లిపూర్ శివారులో... ముళ్ళ పొదల్లో దాచి పెట్టాడు. విశ్వసమీయ సమాచారంతో డిప్యూటీ తాహసీల్దార్​ బాల ప్రసాద్​ బృందంతో కలసి... దాడి చేసి బియ్యం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: కిడ్నాప్​ కేసు: భార్గవరామ్ ఇంట్లో పథకం... 20 మంది 'గ్యాంగ్​'తో అమలు

ABOUT THE AUTHOR

...view details