మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలంలో పోమల్ గ్రామంలో పండుగ రోజు విషాదం చోటుచేసుకుంది. పదోతరగతి చదువుతున్న విద్యార్థిని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
తల్లి మందలించిందని బాలిక ఆత్మహత్య - 10th Class student suicide in Mahabubnagar district
తల్లి మందలించిందని మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని పోమల్ గ్రామంలో చోటుచేసుకుంది.
![తల్లి మందలించిందని బాలిక ఆత్మహత్య 10th Class student suicide in Mahabubnagar district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5722492-1069-5722492-1579098451092.jpg)
తల్లి మందలించిందని బాలిక ఆత్మహత్య
తీవ్రగాయాలైన ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఆమెను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పండుగ వేళ విద్యార్థిని మృతి చెందడం వల్ల పోమాల్ గ్రామంలో విషాదం అలుముకుంది.
తల్లి మందలించిందని బాలిక ఆత్మహత్య
ఇవీచూడండి:పండుగ పూట విషాదం... రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం...