Rape on Minor Girl: తెలుగు రాష్ట్రాల్లో అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కామాంధులు చిన్నా, పెద్దా తేడా లేకుండా తమ పశువాంఛ తీర్చుకుంటున్నారు. ప్రతిరోజు ఏదో ఒక మూల.. ఎక్కడో ఒకచోట బాలికలు, మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతూనే ఉన్నారు. చిన్నారులు, యువతులు, మహిళలు ఒంటరిగా కనపడితే చాలు.. కామాంధులు మృగాళ్లుగా మారి వారి జీవితాలను అంధకారం చేస్తూ.. పైశాచిక ఆనందం పొందుతున్నారు. తాజాగా మహబూబాబాద్‌లో రెండున్నర ఏళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
మైనర్ బాలికపై అత్యాచారం.. స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసిన స్థానికులు - మైనర్ బాలికపై అత్యాచారం దేహశుద్ధి చేసిన స్థానికులు
Rape on Minor Girl: చిన్నారులు, మహిళలపై కామాంధుల అకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒకచోట వారిపై లైంగిక దాడులు, అత్యాచారాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. చుట్టూ ఎవరూ లేని సమయం చూసి వారికి మాయమాటలు చెప్పి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా.. ఎంత కఠినంగా శిక్షించినా.. కీచకుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా మహబూబాబాద్‌లో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని ఓ గిరిజన తండాలో దారుణం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని రెండున్నర సంవత్సరాల చిన్నారిపై 35 సంవత్సరాల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిని గమనించిన తండావాసులు పారిపోతున్న నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం ఆ యువకుడిని విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఈ విషయంపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: