మహబూబాబాద్ జిల్లా బుక్కా తండాకు చెందిన గిరిజన విద్యార్థి యశ్వంత్ రాథోడ్.. దక్షిణాఫ్రికాలోనే ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు. ఎంతో సాహసోపేతంగా కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి.. తిరిగి నగరానికి వచ్చిన యశ్వంత్ రాథోడ్‌ను హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా సత్కారంచారు. ఈ కార్యక్రమంలో గిరిజన అధికారులు, యశ్వంత్ తల్లిదండ్రులు రామ్మూర్తి నాయక్, జ్యోతిబాయిలు, తండా వాసులు పాల్గొన్నారు.
దృఢసంకల్పంతో
భారత త్రివర్ణ పతాకాన్ని కిలిమంజారో పర్వతంపై ఎగరవేయాలనే లక్ష్యంతో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంతో ముందుకు సాగినట్లు యశ్వంత్ రాథోడ్ తెలిపారు. ఈ యాత్రలో 12 మంది బయలుదేరామని... అందులో నలుగురం మాత్రమే అక్కడికి చేరుకున్నట్లు చెప్పారు. పర్వతారోహణ సమయంలో మృతదేహాలు కాళ్లకు తగిలి భయంతో చాలా మంది వెనుదిరిగారని వెల్లడించారు. మార్గ మధ్యలో ఆక్సిజన్ అందక ఇబ్బందులు ఎదుర్కొన్నా.. దృఢసంకల్పంతో లక్ష్యాన్ని చేరుకున్నట్లు వివరించారు.