తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం గున్నేపల్లిలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. వృథాగా మారిన చేతి పంపు వద్ద బిందెలు పెట్టి నిరసన తెలిపారు. వీరునిగడ్డ కాలనీలో 2 నెలల నుంచి తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.
తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల నిరసన - water problem
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం గున్నేపల్లిలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రెండు నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
![తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల నిరసన women protest for drinking water in gunnepally](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7664720-202-7664720-1592461141292.jpg)
తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల నిరసన
ఇప్పటికే ఉన్న చేతిపంపు మరమ్మతులకు గురి కాగా... ప్రత్యామ్నాయంగా విద్యుత్ మోటార్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ మోటార్‌ను సైతం తొలగించడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీకి మిషన్ భగీరథ నీళ్లు రాకపోవటం వల్ల ఇబ్బందులు తప్పడం లేదన్నారు. బోరుబావిలో విద్యుత్ మోటార్ ఏర్పాటు చేయకుండా గ్రామపంచాయతీ పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు కోరారు.