తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్పంచ్​ భర్త వేధింపులు... చితక్కొట్టిన మహిళలు - mahilala dhadi

గ్రామంలో ఓ మహిళతో ఫోన్​లో అసభ్యకరంగా మాట్లాడిన సర్పంచ్​ భర్తపై గ్రామ పంచాయతీ ఆవరణలో మహిళలు దాడి చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

women attack sarpanch husband
సర్పంచ్​ భర్త వేధింపులు... దాడి చేసిన మహిళలు

By

Published : Jun 3, 2021, 5:44 PM IST

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం అవుతాపురం గ్రామ సర్పంచ్​ మంజుల భర్త సుధాకర్​పై అదే గ్రామానికి చెందిన మహిళలు దాడి చేశారు. గతంలో వేరే మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో గ్రామంలో వైరల్​ కావడంతో సంబంధిత మహిళలు గ్రామ పంచాయతీ ఆవరణలో దాడి చేశారు.

సర్పంచ్​ భర్త వేధింపులు... దాడి చేసిన మహిళలు

గతంలోని హన్మకొండ బస్టాండ్ ఏరియాలో ఓ లాడ్జిలో వ్యభిచారం చేస్తూ సర్పంచ్ భర్త సుధాకర్ పట్టుబడినట్లు స్థానికులు ఆరోపించారు. పెద్దవంగర ఎస్సై రియాజ్ పాషా రంగప్రవేశంతో సదరు మహిళకు బహిరంగ క్షమాపణ చెప్పించడంతో గొడవ సద్దుమణిగింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదీ చదవండి:కొవిడ్​ వ్యాక్సిన్​ రెండో డోస్​ తీసుకున్న ఎంపీ రేవంత్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details