మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు తహసీల్దార్ కార్యాలయంలో ఓ మహిళా ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. మండలంలోని విస్సంపల్లికి చెందిన కవిత కొన్నేళ్లుగా రేషన్ డీలర్‌గా పని చేస్తోంది. గత ఏడాది పలు కారణాలతో ఆమెను అధికారులు సస్పెండ్ చేశారు.
అనుమతులివ్వకుండా..
తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జనవరిలో ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపింది. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు తనకు అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించింది. తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.