తెలంగాణ

telangana

ETV Bharat / state

'శాంతి భద్రతల కోసమే నిర్భంద తనిఖీలు' - vehicles seaz

శాంతిభద్రతల కోసం మహబూబాబాద్ పోలీసులు నిర్భంద తనిఖీలు చేపట్టారు. అనుమతి పత్రాలు లేని వాహనాలు, అక్రమంగా నిల్వ చేసిన గుడుంబా, మద్యం స్వాధీనం చేసుకున్నారు.

మహబూబాబాద్ పోలీసుల తనిఖీలు

By

Published : Mar 13, 2019, 1:12 PM IST

మహబూబాబాద్ పోలీసుల తనిఖీలు
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి కోరారు. మరిపెడలో పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహించి... అనుమతి పత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలు, 9 ఆటోలు, నాలుగు చక్రాల వాహనాలు 6, ట్రాక్టర్‌ 1, 3 లీటర్ల గుడుంబా, 20 లీటర్ల బెల్లం పానకం, 24 కిలోల నల్లబెల్లం, 25 వేల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిర్భంద తనిఖీలతో ప్రజలకు భరోసా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details