తెలంగాణ

telangana

ETV Bharat / state

బిల్లు కట్టాలంటే... రెండు కిలోమీటర్లు పోవాల్సిందే - విద్యుత్​ బిల్లులు

మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు డివిజన్​ కేంద్రంలోని ప్రజలు కరెంటు బిల్లు కట్టాలంటే అవస్థలు పడుతున్నారు. బిల్లు చెల్లించాలంటే... రెండు కిలోమీటర్ల దూరం పోవాల్సి వస్తుందని తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

బిల్లు కట్టాలంటే...రెండు కిలోమీటర్లు పోవాల్సిందే

By

Published : Apr 15, 2019, 11:16 PM IST

మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు డివిజన్​ కేంద్రంలో కరెంటు బిల్లులు కట్టడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్​ బిల్లు చెల్లించాలంటే... పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి కట్టాల్సివస్తోంది.

గతంలో విద్యుత్​ కార్యాలయం పట్టణంలోనే ఉండేది. ప్రస్తుతం తొర్రూరుకు దూరంగా కొత్తగా ఈఆర్​ఓ కార్యాలయం నిర్మించారు. ప్రజలు అక్కడే కరెంటు బిల్లు కట్టాల్సివస్తోంది. స్థానికంగా తొర్రూరులోనే మరో ప్రత్యేక కౌంటర్​ను ఏర్పాటు చేయాలని వినియోగదారులు డిమాండ్​ చేస్తున్నారు.

బిల్లు కట్టాలంటే...రెండు కిలోమీటర్లు పోవాల్సిందే

ఇవీ చూడండి: టిక్​టాక్​ నిషేధంపై 'స్టే'కు సుప్రీం నిరాకరణ

ABOUT THE AUTHOR

...view details