తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.25 ఇది టిఫిన్​ రేటు కాదు.. ఒక రోజు వేతనం - mahabubabad

మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ అమల్లో నీరుగారిపోతోంది. ప్రతిచేతికి పని.. పనికి తగ్గ వేతనం అంటూ ప్రకటనలకే పరిమితమైంది. శ్రమ జీవులను కష్ట కాలంలో ఆదుకుంటాదనుకుంటే కనీస వేతనం కూడా రాని దుస్థితి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో ఉపాధి వేతనదారులు తమకొచ్చే దినసరి వేతనం కనీసం పాలుకొనుక్కునేందుకు కూడా సరిపోవడం లేదంటున్నారు.

wage seekers

By

Published : May 17, 2019, 2:19 PM IST

వారంతా శ్రమజీవులు.. సూర్యుడు నిప్పులు కక్కుతున్నా.. చేతిలో పలుగు కాలిపోతున్నా.. భూమి ఆవిర్లు కక్కుతున్నా.. అలుపెరగక వారాంతం వచ్చే ఉపాధి వేతనం డబ్బును తలచుకుంటూ కష్టపడతారు. కాని వారి కష్టానికొచ్చేది కేవలం రెండొందల నుంచి మూడొందల రూపాయలు మాత్రమే. ఇదేదో రోజుకు కాదు మొత్తం వారానికి.. అంటే ఒక్క రోజుకు వారికి ముట్టేది కేవలం రూ.25 నుంచి రూ.30 మాత్రమే. ఎక్కడ జరుగుతోంది ఇంత శ్రమ దోపిడి అనుకుంటున్నారా.. మహబూబాద్​జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురంలో అమలవుతున్న ఉపాధిహామీ పథకంలో..

మరీ ఇంత తక్కువ

వేకువ జామునే పనికొచ్చి మధ్యాహ్నం వరకూ కష్టించినా కనీస వేతనం దక్కడం లేదు. కష్టించడమే తెలిసిన ఆ శ్రమజీవులు తమ గోడును ఎవరికి వెల్లబుచ్చుకోవాలో తెలియడం లేదంటున్నారు.

ఆడ, మగ భేదం లేకుండా శ్రమిస్తే వారాంతంలో వచ్చే మొత్తం కనీసం పాలు కొనడానికి కూడా సరిపోదంటున్నారు. పనికి తగ్గ వేతనం ఇస్తామని చెప్పుకొస్తున్న ప్రభుత్వం తమ కష్టాన్ని చూసి దానికి తగ్గ వేతనం ఇవ్వాలంటున్నారు. ఎండా కాలంలో పని ప్రదేశంలో మంచినీటి సౌకర్యం కల్పించాలని వేడుకొంటున్నారు.

రూ.25 ఇది టిఫిన్​ రేటు కాదు.. ఒక రోజు వేతనం

ఇదీ చదవండి: చేతులు బొబ్బలెక్కినా 'ఉపాధి' గిట్టుబాటు కావట్లేదు

ABOUT THE AUTHOR

...view details