మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సహకార ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కావడం వల్ల వివిధ గ్రామాల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
సహకార ఎన్నికల్లో బారులు తీరిన ఓటర్లు - latest news on Voters turn up in cooperative elections
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా సహకార ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
![సహకార ఎన్నికల్లో బారులు తీరిన ఓటర్లు Voters turn up in cooperative elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6079723-39-6079723-1581744332919.jpg)
సహకార ఎన్నికల్లో బారులు తీరిన ఓటర్లు
జిల్లా వ్యాప్తంగా మొత్తం 13 సహకార సంఘాలకు గానూ.. 7 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 6 సహకార సంఘాలకు పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల్లో 3 వేల 926 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
సహకార ఎన్నికల్లో బారులు తీరిన ఓటర్లు