మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు... ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేశారు.నియోజకవర్గ పరిధిలో కరోనా ప్రభావం ఎలా ఉంది, పాజిటివ్ కేసులు ఏమైనా వచ్చాయా అనే విషయాల గురించి ఆరా తీశారు.
ఎంపీ మాలోతు కవితకు ఉపరాష్ట్రపతి ఫోన్ - vicepresident venkaiah naidu called mahabubabad mp
మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేశారు. నియోజకవర్గ పరిధిలో ప్రజల యోగక్షేమాలు, కరోనా ప్రభావం ఎలా ఉంది వంటి విషయాలు అడిగి తెలుసుకున్నారు.
![ఎంపీ మాలోతు కవితకు ఉపరాష్ట్రపతి ఫోన్ vicepresident venkaiah naidu called mahabubabad mp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7176421-thumbnail-3x2-phone.jpg)
ఎంపీ మాలోతు కవితకు ఉపరాష్ట్రపతి ఫోన్
అనంతరం మహబూబాబాద్ ప్రజల యోగక్షేమాల గురించి, వారి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్యులు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలు మహమ్మారి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని వెంకయ్యనాయుడు ఎంపీ కవితకు సూచించారు.
ఇదీ చూడండి:కరోనాను అడ్డుపెట్టుకొని 9వేల సైబర్ దాడులు