సొరకాయ అంటే మాములుగా మోచేతి పొడవు ఉంటుంది. కానీ... మహబూబ్నగర్ జిల్లా కొత్తగూడ మండలం కొత్తపల్లిలో భూక్య రాందన్ ఇంటిలో పెట్టిన సోరకాయ సుమారు ఐదు అడుగుల పైనే కాసింది. దూరం నుంచి చూసిన వారు అది పొట్లకాయ అనుకుని భ్రమపడ్డారు. దగ్గరికి వచ్చి చూస్తే మాత్రం సోరకాయ అని తెలిసి అవాక్కవుతున్నారు.
ఇది పొట్లకాయ కాదు... సొరకాయేనండీ...!! - veraity sorakaya
మహబూబాబాద్ జిల్లాలో వింత సొరకాయలు ఆశ్చర్యపరుస్తున్నాయి. మనిషికంటే పొడువుగా పెరిగి అబ్బురపరుస్తున్నాయి. ఈ వింత సొరకాయలను కొనేందుకు ఆ గ్రామస్థులు పోటీపడుతున్నారు.
very long Bottlegourd in kothapally
పది రూపాయలు పెట్టి విత్తనాలు తీసుకు వచ్చి నాటితే... ఇంత పొడవు సొరకాయలు కాస్తున్నాయని రాందన్ తెలిపాడు. వీటిని చూసి గ్రామస్థులు పోటీపడి మరీ తీసుకెళ్తున్నారని పేర్కొన్నాడు.