మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తుర చెరువు మత్తడి పోస్తుండగా.. అకడున్న ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో తొర్రూరు- నర్సంపేట మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు పొంగి పొర్లుతున్నాయి.
తొర్రూరు - నర్సంపేట మధ్య నిలిచిన వాహనాల రాకపోకలు - vehicles cant be moved at torrur narsimpeta road in mahabubabad district
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, నర్సంపేట మధ్య వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయ కలిగింది. వర్షాలు ఇలాగే ఇంకొద్ది రోజులు కొనసాగితే.. రవాణా స్తంభించి తాము బాహ్యప్రపంచానికి దూరం చేస్తాయని స్థానికులు భయపడుతున్నారు.
తొర్రూరు - నర్సంపేట మధ్య నిలిచిన వాహనాల రాకపోకలు
జిల్లావ్యాప్తంగా ఇలాగే వర్షాలు కొనసాగితే తమను బాహ్యప్రపంచంతో దూరం చేసి అవస్థలపాలు చేస్తుందని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు మథనపడుతున్నారు. వాగులు ఉప్పొంగినప్పుడు రవాణా స్తంభింస్తుందని స్పష్టంచేశారు.
ఇవీ చూడండి:ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు
TAGGED:
VAHANALAKU_ANTHARAYAM