కరెన్సీ నోట్లపై మహాత్ముడు మొక్కలు నాటే చిత్రాలు ముద్రించాలని పద్మశ్రీ వనజీవి రామయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పచ్చదనం పరిరక్షణ, హరితహారంపై ప్రజల్లో అహగాహన కల్పించేందుకు మహబూబాబాద్ జిల్లాలో బండ్లమాంబ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మానుకోట హరిత చైతన్య రథాన్ని వనజీవి రామయ్యతో పాటు ఎస్పీ కోటిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు హరితహారం ఆవశ్యకతపై 150 మీటర్ల జాతీయ జెండాతో పట్టణంలో భారీగా ర్యాలీ నిర్వహించారు. చెట్లను దైవ స్వరూపాలుగా భావించి పరిరక్షించాలని వనజీవి రామయ్య సూచించారు.
కరెన్సీ నోట్లపై మొక్కలు నాటే చిత్రాలు ముద్రించాలి - VANAJEEVI RAMAYYA
మొక్కల పరిరక్షణపై 108 రోజుల పాటు అవగాహన కల్పించేందుకు బండ్లమాంబ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మానుకోట హరిత చైతన్య రథాన్ని ఏర్పాటుచేశారు. వనజీవి రామయ్యతో కలిసి ఎస్పీ కోటిరెడ్డి ఈ రథాన్ని ప్రారంభించారు. కరెన్సీ నోట్లపై మహాత్ముడు మొక్కలు నాటే చిత్రాలు ముద్రించాలని పద్మశ్రీ వనజీవి రామయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కరెన్సీ నోట్లపై మహాత్ముడు మొక్కలు నాటే చిత్రాలు ముద్రించాలి