మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గుండ్రపల్లి, దుర్గారం, లక్ష్మీపురం గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వడగల్ల వర్షం కురిసింది. ఈ అకాల వర్షానికి వందల ఎకరాల్లో కోతదశలో ఉన్న వరి నేలరాలింది. దుర్గారం గ్రామానికి చెందిన సుతారి లచ్చమ్మ నేలకు వరిగిన పంటను చూసి కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఏట పంట భాగా పండింది... అప్పులు తీర్చుకోవచ్చనుకున్న అన్నదాత అనందాన్ని అకాలం వర్షం ఆవిరి చేసింది.
వరి నేలపాలు... ఆశల సాగు నీళ్లపాలు - unseasonal rains at kothaguda manda durgam and gundrepally laxmipuram villages
కొత్తగూడ మండలంలో ఈదురుగాలుతో కూడిన వగడల్ల వాన బీభత్సం సృష్టించింది. ఈ అకాల వర్షానికి వందల ఎకరాల్లో వరి నేలరాలింది.
రైతన్న ఆశలపై అకాల వర్షం
నోటికాడి కూడు నేలపాలయిందని కర్షకులు కంటతడి పెట్టుకున్నారు. ప్రభుత్వమే పెద్దమనుసుతో ఆదుకోవాలని విన్నవించుకుంటున్నారు.
ఇదీ చూడండి:ప్రజలు బయటకు రాకుండా తాళాలు.. తెరిపించిన కలెక్టర్