తెలంగాణ

telangana

ETV Bharat / state

మిరప చేనులో గొడుగులతో ఏం చేస్తున్నారో తెలుసా?

ఇన్ని రోజులు చలికి వణికిన జనాలు.. ఇప్పటినుంచి ఎండ నుంచి రక్షణ పొందాల్సిన తరుణం వచ్చేసింది. వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. భయపడుతున్న వ్యవసాయ కూలీలు తమ రక్షణ కోసం గొడుగులను వినియోగిస్తున్నారు.

By

Published : Feb 27, 2021, 5:53 PM IST

umbrellas in the chili garden at Lakshmipuram in mahabubabad
మిరప చేనులో గొడుగులతో ఏం చేస్తున్నారో తెలుసా?

వేసవికాలం రాకముందే ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా బ్రాహ్మణపల్లి లక్ష్మీపురంలో మిరప తోట ఏరేందుకు వచ్చిన కూలీలు.. ఎండ నుంచి రక్షణ పొందడానికి గొడుగులను వినియోగిస్తున్నారు. పని చేయడానికి వచ్చిన 25 మంది కూలీల్లో 20 మంది గొడుగులు పెట్టుకుని పనిచేయడం గమనార్హం.

ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 వరకు గొడుగు నీడలోనే పని చేస్తున్నామని కూలీలు చెబుతున్నారు. ఇంటి నుంచే గొడుగులు తెచ్చుకుంటున్నామని.. వేసవి ప్రారంభం కాకముందే ఎండ తీవ్రత పెరిగిందని వారు చెబుతున్నారు.

ఇదీ చూడండి: బిట్టు శ్రీనును పోలీస్​ కస్టడీకి అనుమతించిన కోర్టు

ABOUT THE AUTHOR

...view details