మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన రవి, వేణు సమీప బంధువులు. మహబూబాబాద్ నుంచి నర్సంపేటకు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. మార్గమధ్యలో సమీపంలో అదుపు తప్పి కింద పడ్డారు. అటుగా వెళ్తున్న బాటసారులు వీరిని గమనించి ఆసుపత్రికి తరలించారు.
ద్విచక్రవాహనం అదుపుతప్పి ఇద్దరు మృతి - mahabubabad road accident
ద్విచక్రవాహనంపై వెళ్తోన్న ఇద్దరు వ్యక్తులు అదుపు తప్పి కిందపడగా అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
accident
తలకు తీవ్రగాయం కావడం వల్ల ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. నూతన హైవే నిర్మాణ ప్రదేశంలో హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు ఆరోపించారు.