మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపల్ కేంద్రంలో అక్కాచెల్లెళ్లకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరణ చేశారు. వీరిలో చెల్లెలు ఇటీవల వరంగల్‌లోని తమ బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తికి ఈమె ప్రైమరీ కాంటాక్ట్‌గా ఉంది. అనంతరం ఆమె జూన్ 28న సొంతూరుకు వచ్చేసింది. హైదరాబాద్ నుంచి ఆమె అక్క కూడా ఇటీవలే వచ్చింది. వీరి నమూనాలు సేకరించి వైద్యులు పరీక్షల నిమిత్తం పంపారు. గురువారం వచ్చిన రిపోర్టుల్లో ఇద్దరికి వైరస్ సోకినట్లు నిర్ధరించారు.
అక్కాచెల్లెళ్లకు కరోనా పాజిటివ్... ప్రైమరీ కాంటాక్టే కారణమా? - కరోనా పాజిటివ్ కేసుల వార్తలు
తొర్రూర్‌లో ఇద్దరికి కరోనా వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కరోనా వచ్చిన వ్యక్తికి ప్రైమరీ కాంటాక్ట్‌గా ఉన్న చెల్లికి, ఇటీవలే హైదరాబాద్ నుంచి వచ్చిన అక్కకి కరోనా వచ్చినట్లు నిర్ధరణ అయింది. వీరికి స్వల్పంగా జలుబు చేయడంతో అధికారులు నమూనాలు సేకరించారు.
అక్కాచెల్లెళ్లకు కరోనా పాజిటివ్... ప్రైమరీ కాంటాక్టే కారణమా?